Thursday, 5 November 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి –సీపీఎం

 

 

 

 

 

మోత్కూరు ఏప్రిల్ 12 జనంసాక్షి : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, వస్తుందని, మార్కెట్ తో పాటు గ్రామాలలో ఐకేపి కేంద్రాలను ప్రారంభించి, వెంటనే ధాన్యం కొనుగోలు చెయ్యాలని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మోత్కూరు లో పత్రికా ప్రతినిధుల తో మాట్లాడుతూ… రైతులు అరుకాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోలు చేయకపోవడంతో, ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని అన్నారు. మార్కెట్ తో పాటు, గ్రామాల కోనుగొలు కేంద్రాలలో, ధాన్యం రాశులు పోసి, ప్రభుత్వం కొనుగోలు కోసం రైతులు ఎదిరి చూస్తున్నారని, ఒక వైపు ప్రభుత్వం దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో, మరోవైపు అకాల వర్షాలు, వడగండ్లు, ఈదర గాలులతో, నష్టం జరుగుతుందనే ఆలోచనతో, రైతులు దళారులను అశ్రహిస్తున్నారని, ప్రభుత్వం స్పందించి, తక్షణమే యుద్ద ప్రాతిపాదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోలు చేయ్యాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు వెండి యాదగిరి, పిట్టల చంద్రయ్య, ఉన్నారు.