Thursday, 5 November 2026

పన్నూరు తై బజార్ వేలం పాట

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామ పంచాయతీ 2023-24 సం సంబందించిన తై బాజార్ వేలం పాట ను మంగళవారం స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి అధ్యక్షతన మండల పంచాయతీ అధికారి కాటం భాస్కర్ సమక్షంలో నిర్వహించారు. ఈ వేలం పాటలో నిర్ణయించిన అప్సెట్ ప్రైజ్ 3,05,630 కి పోటా పోటీగా సాగిన వేలం లో 3,87,000 కు సాగ నాగరాజు దక్కించుకున్నారు. రెండవ పోటీ ధారుడిగా పల్లె వెంకటేష్ 3,86,000 నిలిచారు. కార్యక్రమములో స్థానిక ఎంపిటిసి చిందం మహేష్,కార్యదర్శి ఆకాష్, కారొబార్ పెరుమాండ్ల అభి ,వేలం పాట సభ్యులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.