Monday, 2 November 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నెక్కొండ సీఐ హతిరాం, చెన్నరవుపేట ఎస్సై తోట మహేందర్ .

జనం సాక్షి, చెన్నరావు పేటధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాన్స్ పోర్ట్ విషయంలో & గన్ని సంచుల సమస్యల పైన రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని సంబంధిత ఏజెన్సీలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి వున్నందున కొనుగోలు కేంద్రాల నుండి గిడ్డంగుల వద్దకు ధాన్యం తరలింపుకు సహకరించాలి అని తెలిపారు. రైతులు నేరుగా తమ సొంత వాహనాల ద్వారా ధాన్యం సెంటర్ల నుండి మిల్లులకు రవాణా చేసుకున్నట్లయితే రైతులకు నేరుగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పడం జరిగింది.ధాన్యం కొనుగోలులో 42 కిలోల కంటే ఎక్కువ తుకం వేయరాదని,ఒకవేళ అలా ఎవరైనా వేస్తే తక్షణమే మా పోలీసులకి తెలియచేయాలని చెప్పారు. ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా ధాన్యాన్ని వాహనాల్లో నుండి దింపాలని రాధాకృష్ణ మిల్లు యజమానికి సూచనలు చేశారు.