Tuesday, 3 November 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

ఏలూరు,నవంబర్‌3(జ‌నంసాక్షి): రైతులు ధాన్యాన్ని విక్రయించుకునేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు డిఆర్‌డిఎ, కోఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుకు ప్రాథమికంగా కమిటీ ప్రతిపాదించిందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు రవాణా చేసేందుకు సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 12 లక్షల పైచిలుకు

టన్నుల ధాన్యం దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు డిఆర్‌డిఎ, కోఆపరేటివ్‌, సివిల్‌ సప్లయీస్‌, వ్యవసాయ శాఖాధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ సమావేశంలో ఆయన సవిూక్షించారు.జిల్లాలో రైసుమిల్లుల వివరాలు సేకరించి ఏ రైస్‌ మిల్లుకు ఎంత ధాన్యం పంపిణీ చేస్తున్నదీ నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.