భువనగిరి టౌన్ జనం సాక్షి :—-రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అకాల వర్షం లో తడిసి ముద్దయి ధాన్యం తలసిపోవడం వల్ల రైతులు నష్టాలపాలైతున్నారని రోడ్డున పడుతున్నారని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాలు ఆర్భాటంగా ప్రారంభించారు. తప్ప ధాన్యం కొనుగోలు చేయడం లేదని అధికారులు పర్యవేక్షణ కరువైంది బొగ్గు టన్నులు రైతులకు అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించకపోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు అని అన్నారు ప్రస్తుత సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకుండా నిమ్మకు నీరెక్కినట్టుగా చేస్తున్నారని ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఒక్కో దాన్యం బస్తాపై ఎనిమిది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు లారీల కొరత వల్ల ఐ కే సి కేంద్రాల వద్ద రైతుల కుప్పలు కుప్పలుగా నిల్వ ఉన్నాయని అన్నారు రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని రైతులు పడుతున్న ఇబ్బందులకు చాలా బాధాకరమని రెండో కాలంలో మండుతున్న రైతులు పడుతున్న అవస్థలు చూసి ప్రభుత్వం ఇప్పటికైనా త్వరగా కొనుగోలు చేయాలని కోరారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు లేనిపక్షం లో రైతులకు అండగా నిలిచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోలు చేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది….. రైతులకు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రతి గింజ కొనుగోలు చేయాలి డిమాండ్




