Wednesday, 4 November 2026

రాష్ట్ర మత్స్యకార సహకార సంఘం చైర్మన్ పదవి గంగపుత్రులకు కేటాయించాలి

 

 

 

 

మహబూబాబాద్ రూరల్ మే 23 (జనంసాక్షి) :- ఈ సమావేశంలో మైస నాగయ్య మాట్లాడుతూ తరతరాలుగా సాంప్రదాయ చేపలు పట్టే వృత్తిని ప్రధాన ఆధారంగా జీవిస్తున్న గంగపుత్ర బెస్త వృత్తిలోకి పండ్లు ఫలాలు సేకరించే ముదిరాజ్ కులస్తులు చేపలు పట్టే వృత్తిలోకి చేరి బెస్త గంగపుత్రులను ఆర్థికంగా నష్టపరిచి గంగపుత్రులకు తీరని అన్యాయం చేస్తున్నారని మరియు అధిక సంఖ్యాకులుగా ఉన్న ముదిరాజుల ఓటు బ్యాంకు కోసం వారిని ప్రభుత్వమే ప్రోత్సహించుతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో క్రింది తీర్మానాలను ఆమోదించనైనది
1. జీవో నెంబర్ 45 ప్రకారం ముదిరాజులకు కేటాయించిన రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ పదవిని సాంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులకు కాకుండా ముదిరాజ్ కులస్తులకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
2. రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ పదవిని గంగపుత్రులకె కేటాయించాలని తీర్మానించడం జరిగినది
3. సాంప్రదాయ మత్స్యకార వృత్తి కేవలం గంగపుత్రులకే ఉండాలి చేపలు పట్టే వృత్తిలోకి ఇతర కులస్తులకు ప్రవేశం ఉండనీయమన్నారు.
ఈ సమావేశంలో పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షులు వెంకటస్వామి గారు, సొసైటీ కార్యదర్శి పిల్లి ధశరదం,పట్టణ గంగపుత్ర సంఘం కోశాధికారి దేశబోయిన అనిల్ కుమార్ , మరియు సంఘ సభ్యులు చుక్కల నాగయ్య , దేశబోయిన శ్రీనివాసులు, దేశబోయిన విజయ్, అవారి సునిల్ కుమార్ పారుపల్లి వెంకటేశ్వర్లు , గోధుమల గోపి, చుక్కల నరేష్, బయ్య విక్రమ్ తదితరులు పాల్గొన్నారు