వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 30{ జనం సాక్షి}ధారూర్ హనుమాన్ మందిర్ నిర్మాణానికి 51,111రూపాయలు అందించిన ఎంపీపీ విజయలక్ష్మి హనుమంత్ రెడ్డివికారాబాద్: నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో గల హనుమాన్ మందిర ఆలయ నిర్మాణానికి హనుమంత్ రెడ్డి ఆదివారం 51,111రూపాయల నగదును గ్రామస్తులకు అందజేశారు. హనుమాన్ మందిర ఆలయ నిర్మాణానికిన తన వంతు సహాయంగా ఈ ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. భగవంతుని ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రమౌళి , ధారూర్ మండల పరిషత్ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు బసప్ప, భారాస నాయకులు యూనుస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు హఫీజ్ ఖురేషి, వార్డ్ సభ్యుడు దావూద్ , ఇనాయతుల్లా ఖాన్,లక్ష్మయ్య, అంజయ్య , అశోక్, తదితరులు పాల్గొన్నారు.




