రుద్రుర్ (జనంసాక్షి): రుద్రుర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ప్రాంతీయ వరి , చెరుకు పరిశోధన వద్ద నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగా రంగా వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ దశమి ఆదివారం ఉదయం 10:35 నిమిషాలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చి అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ వేడుకలో చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమంలో రుద్రుర్ గ్రామానికి చెందిన ప్రసన్ రెడ్డి దంపతులు, బీర్కూర్ గ్రామానికి చెందిన డి సంతోష్ కుమార్ దంపతులు, బోధన్ కు చెందిన వెంకట్ శివ దంపతులు మరియు ఎం శేఖర్ దంపతులు పాల్గొన్నారు, వేద పండితులు శ్రీనివాస్ శర్మ, విష్ణు శర్మ, రోహిత్ శర్మ, మరియు అర్చకులు నిశాంత్, ప్రాంతీయ వరి మరియు చెరుకు పరిశోధన సంస్థ హెడ్ బాలాజీ నాయక్, గ్రామ సర్పంచ్ తిగుళ్ల గంగామణి వరప్రసాద్ , ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు,




