Wednesday, 4 November 2026

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

 

 

 

 

దండేపల్లి జనంసాక్షి మార్చి 30 దండేపల్లి ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు 1999 2000 విద్యా సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై వచ్చారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒకరికొకరు కుటుంబ సభ్యుల యోగక్షేమాలను చెప్పుకున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు నృత్యాలు చేస్తూ ఆడి పాడారు చదువు చెప్పిన గురువులను పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించారు పాఠశాల ప్రాంగణం పూర్వ విద్యార్థుల ఆటపాటలతో మారు మ్రోగింది ఈ కార్యక్రమంలో గురువులు మధుసూదన్ సంఘర్స్ రాజేశ్వరరావు కొండు జనార్ధన్.మురళి.సత్యమూర్తి. ధర్మారెడ్డి. శంకర్.లక్ష్మీరాజం.సత్యనారాయణ.బలచౌరీ.రాధాకృష్ణ. సహదేవ్ లతోపాటు విద్యార్థులు  పాల్గొన్నారు