
న్యూఢిల్లీ: ప్రపంచ కప్లో వరుసగా రెండో విజయం సాధించిన టీమిండియాపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించిన వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్లో ఇదే జోరు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. రాజకీయ, క్రీడా ప్రముఖులు ధోనీసేనను ప్రశంసించారు.
ఇక క్రికెట్ అభిమానుల్లో పండగ వాతావారణం నెలకొంది. ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయం సాధించిన ధోనీసేన.. బలమైన దక్షిణాఫ్రికా జట్టుతో మ్యాచ్లో అంచనాలకు మించి రాణించింది. ప్రపంచ కప్ సఫారీలతో ఇంతకుముందు మూడు మ్యాచ్లాడిన భారత్ ఒక్కటీ గెలవలేకపోయింది. తాజా మ్యాచ్లో ఆ ఆనవాయితీని తిరగరాసి ధోనీసేన ఘనవిజయం సాధించడంతో అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 20 రోజులకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో చెత్తగా ఆడిన టీమిండియా.. అదే చోట ప్రపంచ కప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయభేరీ మోగిస్తోంది.




