నందిగామలో వ్యక్తి ఆత్మహత్య
నవీపేట, జనంసాక్షి: మండలంలోని నందిగామ గ్రామంలో నాగన్న(35) ఇంటిలోని దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గత కొంతకాలంగా భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృత దేహాన్ని శవ పంచనామాకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.