టేకులపల్లి,మే 27( జనం సాక్షి ): మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్ రైతువేదికలో వ్యవసాయ, పోలీసు శాఖల సంయుక్త ఆద్వర్యంలో విత్తన డీలర్స్ కు శనివారంసమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిగితే కఠిన చర్యలతో పాటు, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని టేకులపల్లి సిఐ ఇంద్రసేనారెడ్డి, ఇల్లందు వ్యవసాయ సంచాలకులు వాసవి రాణిలు హెచ్చరించారు. విత్తన డీలర్లకు విత్తనాలు పర్మిషన్ ఉన్న కంపెనీ నుండి మాత్రమే తెలుసుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా సమావేశంలో విత్తన డీలర్స్ కు విధిగా పాటించాల్సిన కొన్ని నియమాలను సూచించారు.1)షాప్ యొక్క పేరు డోర్ నెంబర్ కనిపించే విధంగా కనిపించాలి.
2)సీడ్ లైసెన్స్ కొనుగోలు దారులకు కనిపించేవిదంగా పెట్టాలి. 3) ధరల పట్టిక రైతులకుకనిపించేవిదంగా పెట్టాలి. బ్లాక్ మార్కెటింగ్ చేయరాదని హెచ్చరించారు. అలాగే నిషేధిత వితనాలైన బీ టి -3 విత్తనాలు ఎవరైనా అమ్మితే పోలీస్,వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, మండల వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ, ఏ ఈ ఓ శ్రావణి, విత్తన డీలర్లు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలను అమ్మితే పీడి యాక్ట్ కేసు నమోదు చేస్తాం




