జనంసాక్షి, రామగిరి : లేబర్ కార్డు ఉన్న భవన నిర్మాణ రంగాల కార్మికుల కోసం రామగిరి మండల కేంద్రంలో న్యాక్ సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికుల ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి అన్నారు. ఈ శిక్షణ శిబిరం రామగిరి మండలం రత్నాపూర్ బస్టాండ్ పక్క బిల్లింగ్ లో ఈ నెల 31 వరకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందని, ఈ శిక్షణను వినియోగించుకునే వారు తమ లేబర్ కార్డు, ఆధార్ కార్డ్ ,బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్, జిరాక్స్లు, రెండు ఫోటోలు ఇవ్వగలరని వివరముల కోసం 7780421180 సంప్రదించగలరన్నారు. ఈ శిక్షణ తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ మేస్త్రీలు, ప్లంబర్, అండ్ ఎలక్ట్రిషన్, పెయింటర్స్, కార్పెంటర్స్ కు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ 15 రోజులు జరుగుతాయని, శిక్షణ కాల వ్యాధులలో రోజుకు 300/- ప్రతి ట్రైనీకి స్టైపెండ్ ఇస్తారని , శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ కాల వ్యవధిలో మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంటుందన్నారు. అలాగే నిర్మాణ కార్మికులపై ఆధారపడిన నిరుద్యోగ బాలికలు, మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ 90 రోజులు నిర్వహించి వారికి ఫ్రీగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని రామగిరి మండల నిర్మాణ కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భవన నిర్మాణ కార్మికుల కోసం నైపుణ్యభివృద్ధి శిక్షణ శిబిరం




