భైంసా రూరల్ మే 20జనం సాక్షి : నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలో ఏ డి ఏ వీణ, పట్టణ సీఐ శీను ఫర్టిలైజర్ షాప్ లను తనిఖీ చేశారు అదేవిధంగా బైంసా మండలంలోని పలు గ్రామాలలో రూరల్ సీఐ చంద్రశేఖర్ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏడీఏ వీణ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా రైతులు విత్తనాలు తీసుకునే ముందు అవి నకిలీ విత్తనాల వర్జిన్ అలా అని తెలుసుకొని తీసుకోగలరని తెలిపారు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం వస్తే పోలీసుల కైనా అగ్రికల్చర్ ఆఫీసర్ల కైనా తెలియపరచగలరని తెలిపారు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పత్తి, కంది సాగు రైతులు ఏవోల, ఏఈవోల సలహాలను పాటించాలన్నారు. రైతులు ఖరీదు చేసిన ప్రతీ దానికి రసీదు ఇవ్వాలని దుకాణాదారులను ఆదేశించారు.
ఈమె వెంట బైంసా ఏవో రామచంద్రనాయక్ పట్టణ సీఐ శీను ఉన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు – ఏ డి ఏ వీణ..




