Thursday, 5 November 2026

సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్ఏలు – డోర్నకల్ లో సంబరాలు చేసుకున్న వీఆర్ఏలు

 

డోర్నకల్,మే19- జనం సాక్షి న్యూస్:
వీఆర్ఏలను క్రమబద్దికరణ చేస్తున్నాట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో రాష్ట్ర విఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ లు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి,మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏ ల జేఏసీ మండల అధ్యక్షుడు ఆలేటి బాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్ఏల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో డోర్నకల్ కో చైర్మన్ దార్ల యాదగిరి,పిడమర్తి సురేష్, జిల్లా నాయకులు జువ్వల పుట్టబంతి, చంద్రశేఖర్, గోపరాజు, రామకృష్ణ, దివ్యభారతి, మాధవి, కవిత, ఖలీల్ పాషా, ప్రభాకర్,నాగుల్ మీరా, సోమయ్య,శ్రీను,సాయిరాం,లలిత, రజియా,సీతయ్య, అంకయ్య, సతీష్, గంట వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.