12 వేల ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించింన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఆధ్వర్యంలో ఈ ఆక్రమణలు తొలగింపు కొనసాగుతుంది. నేడు అంబర్‌పేట నుంచి ఉస్మానియా గేట్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆరు బృందాలు నాలుగు మార్గాల్లో ఆక్రమణలను తొలగిస్తున్నాయి. ఈ సందర్భంగా విశ్వజిత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. న్యాయబద్దంగానే ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగింపు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో ఇప్పటికే 12 వేల ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించినట్లు వెల్లడించారు.
నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు




