Tuesday, 3 November 2026

చాంద్రాయణగుట్ట పీఎస్‌ పరిధిలో వ్యక్తి  దారుణ హత్య 

హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల బర్కాస్‌ మైదానం సవిూపంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని వలి సాదీ(24)గా గుర్తించారు. కొందరు వ్యక్తులు వలీపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఇన్సెపెక్టర్‌ కోటేశ్వర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డబ్బు విషయంలో తలెత్తిన వివాదాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు