కుమార్తె అనుమానాస్పద మృతి
హైదరాబాద్,జూలై28(జనం సాక్షి): ప్రముఖ సినీనటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి (23) శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆమె ఎరేసుకుని మృతి చెందగా గుర్తించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ సాయితో కీర్తికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని కృష్ణా బ్లాక్‌లో కీర్తి నివాసం ఉంటున్నారు. బెంగళూరులో ఉన్న వెంకటకృష్ణ తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కీర్తి నిద్రపోతుండటంతో ఆయన వేరే గదిలో పడుకొన్నారు. ఉదయం నిద్ర లేచేసరికి కీర్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినట్లు ఆయన పేర్కొన్నారు. వెంటనే పక్కనే గోదావరి బ్లాక్‌లో నివాసం ఉంటున్న అన్నపూర్ణకు సమాచారం ఇచ్చి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా కీర్తి ఆరోగ్యం సరిగా లేదని.. దీనికి సంబంధించి మందులు సైతం తీసుకుంటున్నారని వెంకటకృష్ణ పోలీసులకు వివరించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో తల్లి అన్నపూర్ణ కన్నీరుమున్నీరయ్యారు.




