Thursday, 5 November 2026

నటుడు వినోద్‌ కన్నుమూత

హైదరాబాద్‌,జూలై14(జ‌నం సాక్షి): సీనియర్‌ నటుడు వినోద్‌(59) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్‌స్టోక్ర్‌తో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన పలు సీరియళ్లలోనూ నటించారు. వినోద్‌ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్‌, మిర్చి తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో విలన్‌గా అందరికీ సుపరిచితం. బుల్లితెర సీరియళ్లలోనూ బాగా రాణించాడు. ఆయన మృతికి మా సంతాపం తెలిపింది.