Tuesday, 3 November 2026

నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయం పై, రంజిత్ కుమార్ వాహనాలపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

గద్వాల నడిగడ్డ, మే 31 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయం పై అలాగే బీమ్ నగర్ లో ఉన్న శ్రీనివాస అపార్ట్మెంట్ గొంగళ్ల రంజిత్ కుమార్ వాహనాలపై అతి దారుణంగా దాడి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి అనుచరులను అరెస్టు చేయాలని బుధవారము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్, నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏవో యాదగిరి తో పాటు జిల్లా ఎస్పీ సృజన కి వినతి పత్రం సమర్పించి దాడికి పాల్పడిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతంలో బహుజన వాదాన్ని బలోపేతం చేసేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలను ఐక్యమత్యం చేస్తూ ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన నిలబడి రెండు కుటుంబాల అవినీతి అన్యాయాలు అరాచకాలపై ప్రశ్నిస్తున్నందుకు కక్ష్యకట్టి పథకం ప్రకారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంపై అలాగే మూడు వాహనాలపై అతి దారుణంగా దాడి చేశారని ఆయన ఆరోపించారు.
నడిగడ్డ ప్రాంతంలో బహుజన వాదం ఎదుగుతుందన్న భయంతో బండ్ల రాజకీయం పునాదులు కదులుతుండడంతో మా ఓటమి ఖాయమని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేస్తే ప్రశ్నించడం మానేస్తారని ఊహాగానాలతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.ఈ విషయంపై తరగతిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు,కార్యదర్శి లవన్న, జిల్లా నాయకులు రంగస్వామి,వెంకట్రాములు,అవనిశ్రీ, వీరేష్ యాదవ్, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, ఉపాధ్యక్షుడు మునెప్ప, ఆంజనేయులు కార్యదర్శి రాము,గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు, ఉపాధ్యక్షుడు దయాకర్, కార్యదర్శి నరేష్, మల్దకల్ మండల ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, నజుముల్లా, కార్యదర్శి తిమ్మప్ప,కే.టి.దొడ్డి మండల నాయకులు అంజి, భీమన్ గౌడ్, రాము, ఎల్లేష్,దస్తగిరి గౌడ్,నాయకులు జగదీష్ ఆశన్న,లక్ష్మన్న, శాంతన్న నేతన్న, ఏసన్న, తిరుమలేష్, కే. పిఆర్. రామకృష్ణ, ఉల్లిగెప్ప తదితరులు పాల్గొన్నారు.