బెల్లంపల్లి, మే 31, (జనంసాక్షి )
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా నేడు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ శివారులోని తిరుమల ఫంక్షన్ హాల్ లో ఉదయం 10-30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని, ఇట్టి సమావేశానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పాక్స్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.
నేడు సన్నాహక సమావేశం. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.




