మిర్యాలగూడ, జనం సాక్షి.గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరు కారిపోతుందని జిల్లా రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఏటా 200 పని దినాలు ఉండే విధంగా ఉపాధి చూపాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేయగా సంబంధిత అధికారులు, పర్యవేక్షకుల నిర్లక్ష్యంతో పనులు లేకుండా పోతున్నాయన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలు రోజువారి పని లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఉపాధి హామీ కూలీల ద్వారా చెరువులో గుంతలు తీపియ్యడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని చేసిన పనిని మరల మరల చేసే ప్రయత్నం చేస్తున్నారని,పనులు కూడా ఏమీ లేవని అన్ని గ్రూపులకు ఒకటి రెండు పనులు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.గత నాలుగు సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పనుల ద్వారా వ్యవసాయ కాలువలు మొత్తం. పూడికలు తీసేవారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వ్యవసాయానికి అనుసంధానం చేయటం వలన రైతుల మీద కొంత ఆర్థిక భారం తప్పే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అధికారులు అడిగితే కాలువలు పూడికలు తీసేది మా పరిధిలో లేదు ఇది జిల్లా స్థాయిలో ఉందని దాటవేస్తున్నారని ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయనికి అనుసంధానం చేసి రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు




