Thursday, 5 November 2026

పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరి పైన ఉండాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లి (పుట్టపాక) గ్రామంలో పోచమ్మ కొలుపు కార్యక్రమంలో గురువారం బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ దేవతల అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలకు విరాళం అందజేశారు. ఆయన వెంట అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్,సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి, చల్ల శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.