Wednesday, 4 November 2026

నదిలోకి దూసుకెళ్లిన బస్సు…19 మంది మృతి

ఇస్లామాబాద్‌: పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు పాకిస్థాన్‌ పెషావర్‌ సమీపంలోని నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చర్సద్ద రహదారిలో 45 మందితో వెళ్తున్న పెళ్లి బస్సు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే ఉన్న నదిలోకి దూసుకుపోయింది. భారీ క్రేన్‌ సహయంతో బస్సును బడ్డుకు తీసుకువచ్చి ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో నది ప్రవాహ ఉద్థృతి ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఐదుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *