Thursday, 5 November 2026

నభోజనాలతో ఆధ్యాత్మికత ఆనందం ఆరోగ్యం

నభోజనాలతో ఆధ్యాత్మికత ఆనందం ఆరోగ్యం

సూర్యాపేట ప్రజల చైతన్యానికి ప్రతీక కార్తీక వనభోజనాలు

– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): మొక్కలను నాటడమే కాకుండా నాటిన మొక్కలను కాపాడుకోవాలనే స్పృహ ప్రతి ఒక్కరి లోనూ కార్తీక మాస వన భోజనాల ద్వారా మనకు కలుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం దురాజ్ పల్లిలో కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, మున్నూరు కాపు సంఘం , నూతన కలెక్టరేట్ వద్ద ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యుల వనభోజన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సూర్యాపేట ప్రజల చైతన్యానికి ప్రతీక వనభోజన వేడుకలని అన్నారు.పురాతన కాలం నుండే తెలంగాణలో వన భోజనాల సంస్కృతి ఉందన్నారు.ఇటువంటి వాటి వల్ల సమిష్టి బాధ్యత,మిత్రుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందన్నారు.సూర్యాపేట ప్రజల మధ్య
స్నేహాన్ని, సమైక్యతకు వన బోజనాలు నిదర్శనమన్నారు.చెట్టు నీడన భోజనం చేయడంలో మన ఆరోగ్య రహస్యం దాగి ఉందన్నారు.ముఖ్యంగా ఉసిరి చెట్టు నుండి వీచే గాలితో దేహంలో ఉన్న అనేక రుగ్మతలకు ముకుతాడు వేయవచ్చని తెలిపారు.ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అన్నారు.వన భోజన కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం , ఆరోగ్యం అనే సందేశం కూడా ఉందని చెప్పారు.ఈ సంవత్సరం ప్రకృతి కరుణతో పాడి పంటలు బాగున్నాయని,ఇలాగే ఎల్లవేళలా సూర్యాపేట ప్రజలు పాడి పంటలు , ఆయుర్ ఆరోగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.అంతకు ముందు వన భోజన వేడుకలకు హాజరైన మంత్రికి మహిళలు, చిన్నారులు కొలటాలతో స్వాగతం పలికారు.మంత్రి వెంట మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, నాయకులు సవరాల సత్యనారయణ, బూర బాల సైదులు, గండూరి ప్రకాష్ , గండూరి కృపాకర్, ఉప్పల లలితా ఆనంద్ , లక్ష్మి మకత్ లాల్, బొమ్మిడి లక్ష్మినారాయణ,ఎలిమినేటి రమేష్, అభయ్, డాక్టర్ రమేష్ చంద్ర తదితరులున్నారు.