Tuesday, 3 November 2026

నమ్మించి మోసం చేయడం బిజేపి పార్టీ నైజం-ఎం ఎస్ ఎఫ్ నాయకులు భైరపోగు శివకుమార్ మాదిగ

జహీరాబాద్ మార్చి 1 (జనం సాక్షి )నమ్మించి మోసం చేయడం బిజేపి పార్టీ నైజం అని . ఎం ఎస్ ఎఫ్ నాయకులు భైరపోగు శివకుమార్ మాదిగ అన్నారు. మంద కృష్ణ  మాదిగ  ఆదేశాల మేరకు ఎం ఎస్ ఎఫ్  జిల్లా నాయకులు అబ్రహాం మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సంగ్రామ యాత్ర రెండవ రోజు చింతల్ గట్టులోని బాబు జగ్జీవన్ రాం విగ్రహం దగ్గర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసి నివాళులను అర్పించిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది అలిగి సందీప్ కుమార్ మాదిగల సంగ్రామ యాత్రకు తన సంఘీభావాన్ని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో  స్టేట్ సెక్రటరీ భైరపోగు శివకుమార్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులను స్మరిస్తూ వారికి ఘన నివాళులను అర్పించడం జరిగింది. ఎస్సీ  రిజర్వేషన్ ల వర్గీకరణ కోసం గత 28 సంవత్సరాల నుండి మాదిగ ప్రజలు అనేక పోరాటాలు చేస్తూ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది అన్నారు.. అధికారంలోకి వచ్చిన వంద రోజులలో వర్గీకరణ చేస్తాం అని ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్న బిజేపి  పార్టీ 9 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా వర్గీకరణ మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం మాదిగలు అంటే చిన్నచూపుగా చూస్తున్న  పార్టీకి రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గర లోనే ఉన్నాయి ఆన్నారు. వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్న కేంద్రం ప్రభుత్వం మీద నిరసనగా ఈ మాదిగల సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. జాతి భవిష్యత్తు కోసం జరిగే ఈ సంగ్రామ యాత్రలో అందరు పాల్గొని మార్చి15న జరగబోయే హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పియస్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ మైసగళ్ల బుచ్చెంద్ర మాదిగ, కో-కన్వీనర్ చిరంజీవి మాదిగ, ఎం.ఎస్.పి జిల్లా కన్వీనర్‌ పోట్టోళ్ల వెంకటేశ్, ఎం.ఎస్.పి జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు జైరాజ్, ఎమ్మార్పియస్ ఆందోల్ నాయకులు అలిగె రాజు, సంగేరి మురళి, వి.ఎచ్.పి.యస్ హత్నూర మండల అధ్యక్షుడు తుమ్మళ్ల యాదగిరి, అరకల రమేష్ ఎం ఎస్ ఎఫ్  సీనియర్ నాయకులు, ఎం.ఎస్.ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి మహేష్, ఎం.ఎస్.ఎఫ్ నాయకులు, వసంత్ కుమార్, చిన్న, సాల్మన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.