నరాలు తేగే ఉత్కంఠగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ సెమి ఫైనల్ పోటీ
జహీరాబాద్ జనవరి 14 (జనంసాక్షి): పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో శనివారం ఖిజర్ యఫై గోల్డ్ కప్ సెమి ఫైనల్ పోటీల్లో భాగంగా అఫ్ఫన్ గిబిఆర్ అచ్చంపేట సీసీ మరియు కె ఎఫ్ కోహినూర్ సీసీ జట్ల మధ్య జరిగిన పోటీలో అఫ్ఫన్ గిబిఆర్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 7వికెట్ల నష్టనికి 161 పరుగులు చేయడంతో, 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహినూర్ కె ఎఫ్ సీసీ 9 వికెట్ల నష్టనికి 157 పరుగులు చేయడంతో కోహినూర్ సీసీపై అఫ్ఫన్ సీసీ జట్టు 4 పరుగుల తేడాతో ఉత్కంఠ భరితమైన విజయం సాధించి ఖిజర్ యఫై గోల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించింది, మధ్యాహ్నం రెండవ సెమీ ఫైనల్లో క్రికెట్ కోచింగ్ అకాడమీ సీసీ మరియు గ్రీన్ సిటీ సీసీ అచ్చంపేట జట్ల మధ్య జరిగిన పోటీలో సిసిఏ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడంతో మొదటి బ్యాటింగ్ చేసిన సీసీఏ జట్టు 20 ఓవర్లలో అలౌట్ అయి 111 పరుగులు చేసి అలౌట్ అవ్వడంతో, 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్రీన్ సిటీ జట్టు 11.4 ఓవర్లలో 115 పరుగుల లక్ష్యన్ని ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించడంతో గ్రీన్ సిటీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది, జట్టు విజయంలో కీలక భూమిక వహించిన క్రాంతి కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని, క్రిడ మైదానంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని కనబర్చలని, క్రీడల్లో క్రమశిక్షణ చాలా కీలకమని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ అలీ, బిలాల్ పూర్ సర్పంచ్ నర్సింలు, శేకపూర్ తండా సర్పంచ్ నాగు చవాన్, మొహమ్మద్ మాక్సుద్, సయ్యద్ విఖర్, అబ్దుల్ మాజిద్, విజయ్ రాథోడ్ సోషల్ మీడియా బి ఆర్ ఎస్ మండల ఇంచార్జ్, సద్దమ్ కుసంగి, తజోద్దీన్ శేకపూర్, గౌస్ ఖాన్, మాక్సుద్ ఖాన్, ఇస్మాయిల్ శేకపూర్, అదం యఫై, అబుద్ యఫై, పబ్బతి సంతోష్, తయ్యబ్ అలీ, మద్ద రామి రెడ్డి, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, ఖాజా పటేల్, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఆర్షద్ ఖాన్, ఆసీఫ్ పటేల్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.




