Thursday, 5 November 2026

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

జనం సాక్షి దినపత్రిక మరియు టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియజకవర్గంలో ఎమ్మెల్యే స్వగృహంలో జనం సాక్షి దినపత్రిక మరియు టీవీ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనం సాక్షి ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఛానెల్ మున్ముందు మీడియా రంగంలో మరింత రాణించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వాస్తవ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా వార్తలు ప్రసారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మీడియా మిత్రులు పాల్గొన్నారు..