పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
జహీరాబాద్ అక్టోబర్ 27 (జనంసాక్షి) జహిరాబాద్ డిఎస్పీ వి రఘు, సిఐ జహిరాబాద్ తోట భూపతి స్థానిక ఎస్ఐ కాశీనాథ్ సిబ్బంది తో కలిసి చిరాక్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను, కమ్యూనల్ రౌడీలను, సస్పెక్ట్ షీట్లు పర్సన్ లను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇకముందు సత్ప్రవర్తన కలిగి ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. షీట్ ఉండి కూడా ఏదైనా నేరాలలో చేసినట్లు అయితే వారి పై , కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.గత పది సంవత్సరాల నుంచి వారిపైన ఏలాంటి కేసు నమోదు కాకపోతే వారిపై ఓపెన్ అయిన షీట్ ను క్లోజ్ చేయడానికి ప్రపోజల్స్ పంపిస్తామని తెలపడం జరిగింది. ప్రతి నెల ఒకటో తారీఖున తప్పకుండా పోలీస్ స్టేషన్ కు హాజరై, విధిగా సంతకం చేయాల్సి ఉంటుందని తెలపడం జరిగింది. షిట్ ఉన్న వారందరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు




