నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో గల నర్సులను, దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షులు కల్లెపెల్లి సురేష్ శుక్రవారం ఘనంగా నర్సులను శాలువతో సత్కరించి మెమొంటో బహుకరించి ఘనంగా నర్సుల దినోత్సవాన్ని జరిపినట్లు ఆయన తెలిపారు ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన నట్లు ఆయన పేర్కొన్నారు వారందరిని గుర్తించి నా వంతు సహకరించినట్టు తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ అడిషనల్ సూపరిండెంట్ డాక్టర్ మనోజ్ లాల్ పాల్గొని మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో, అంకిత భావంతో పని చేస్తున్న నర్సుల సేవలు ఎంత కొనియాడిన తక్కువే అని అన్నారు, డాక్టర్లు కేవలం నాడీ చూసి సమస్య చెప్తే రోగికి దగ్గరుండి అన్ని రకాలుగా సేవలందించేది నర్సులేనని, అటువంటి నర్సుల సేవలు మరువలేనివని డాక్టర్ అన్నారు.
డాక్టర్ నవత. రమాదేవి, స్నేహ, ప్రావన్య,శారద, జహర వనజ,సులోచన, తాడు పట్టణ అధ్యక్షులు ఇస్రంకుమార్ మరియు నర్సులందరూ పాల్గొన్నారు.




