నాగర్ కర్నూల్ ఆర్సీ మే 12(జనంసాక్షి):మన ఊరు మనబడి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్.గోవిందరాజులు ఆదేశించారు.శుక్రవారం తాడూర్ మండలం మేడి పూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన మన ఊరు మనబడి అభివృద్ధి పనులను డిఈవో సందర్శించి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ,మరుగుదొడ్ల,కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు.జూన్ మాసంలో పాఠశాలలు తిరిగి పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మన ఊరు మనబడి పనులు త్వరగా తిను పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.




