Tuesday, 3 November 2026

నర్సరీలను తనిఖీ చేసిన డిఆర్డిఓ మధుసూదన్ రాజు

 

 

 

 

 

టేకులపల్లి,ఏప్రిల్ 27( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మధుసూదన్ రాజు ( డి ఆర్ డి ఓ ) టేకులపల్లి మండలం, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటుచేసిన నర్సరీని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసినారు. డి ఆర్ డి ఓ  మాట్లాడుతూ ఖాళీగా ఉన్న అన్ని బ్యాగులలో  విత్తనాలను వెంటనే నాటించాలని, షిఫ్టింగ్ గ్రేడింగ్ వెంటనే చేయించాలని, కలుపుతీసి రోజు నీటిని అందించాలని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి  దుద్దుకూరి బాలరాజు, ఏపీఓ కాలింగి శ్రీనివాస్, ఈసీ తిరుపతయ్య, టిఏ ధనలక్ష్మి, ఎఫ్ ఏ లకన్, నర్సరీ వన సేవకురాలు, సోనియా, వాచర్ లు పాల్గొన్నారు.