మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 27,జనంసాక్షి :నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను వ్యతిరేకిస్తూ తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ కన్వీనర్ సీనియర్ నాయకులు, న్యాయవాది అబ్దుల్ హఫీజ్ ఇంటికి నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు వెళ్లి రాజీనామా ను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరనైనది. జరుగుతున్న పరిణామాలపై అధిష్టాననికి పిర్యాదు చేసినట్టు వారికీ వివరించడమైనది ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు డా:బెజ్జరపు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్, సేవా దళ్ జిల్లా అధ్యక్షులు అందె మారుతీ బాపూజీ, మండలం కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లేందుల రాజు లు వున్నారు.





