Tuesday, 3 November 2026

నర్సరీల పర్యవేక్షణ చిల్లముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్ విజయలక్ష్మి

 

 

 

మహా ముత్తారం మే 04 (జనం సాక్షి)జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి యల్ విజయలక్ష్మి నర్సరీల పర్యవేక్షణ చేశారు. గురువారం మండల పరిధిలోని పెగడపల్లి గ్రామంలో నర్సరీ మరియు పల్లె ప్రకృతి వనం వారు సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీ చక్కగా మెయింటేన్ చేశారని కితాబు ఇచ్చారు. మొక్కల పేర్లు తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కొన్ని ఖాళీగా ఉన్న బ్యాగులలో స్థానిక విత్తనాలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు, ఈసీ శ్రీకాంత్, టెక్నికల్ అసిస్టెంట్ ప్రమీల వెంట ఉన్నారు.