Thursday, 5 November 2026

నర్సులు అందించిన సేవలను ఈ సమాజం ఎన్నటికీ మరువదు – వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 12 (జనంసాక్షి): కరోనా కష్టకాలంలో కుటుంబాలకు దూరమై నర్సులు అందించిన సేవలను ఈ సమాజం ఎన్నటికీ మరువదని మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ అన్నారు. ప్రతి సంవత్సరం మే 12న ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని స్థానిక ఈఎస్ఐ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ విచ్చేసి మాట్లాడుతూ చికిత్స చేయండి అని హాస్పటల్లో చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్లే వరకు వెన్నంటి ఉండి సేవ చేసే సేవామూర్తులు నర్సులని, కరోనా తరువాత మా నర్సులే మా భవిష్యత్తు అనే రీతిలో సమాజం మారిందన్నారు. ఈ కార్యక్రమంలో శాంత కుమారి, లక్ష్మి, వినోద, మాధవి, స్వాతి, నవీన్, ఆశిపు, భూపాల్రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.