Thursday, 5 November 2026

పార్లమెంటు పర్యటనకు ఓయూ విద్యార్థి

 

 

 

 

 

 

బిచ్కుంద మే 12 (జనంసాక్షి)ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీ MA ఇంగ్లీష్ విభాగానికి చెందిన విద్యార్థి చిన్మయ్ రౌత్రే UGC వారిచే ఎంపిక చేయబడి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఢిల్లీకి పంపబడ్డారు. చిన్మయ్ తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి పార్లమెంటులో రవీంద్రనాథ్ టాగోర్ గారి జన్మదినమైన మే 9 న వారిని స్మరించుకుంటు తెలంగాణ తరపున పార్లమెంటుకు హాజరయ్యారు. వీరు ఒక రోజు మొత్తం పార్లమెంటులొ గడిపి లోక్ సభ, రాజ్య సభ మరియు పార్లమెంట్ లైబ్రరీ ని సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా గారిని కూడా కలవటం జరిగింది. ఈ పర్యటన మొత్తం భారత ప్రభుత్వం వారి సహకారంతో జరిగింది. పర్యటనలో భాగంగా చిన్మయ్ ను ఢిల్లీ గేట్ మరియు రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర, ప్రధాన మంత్రి సంగ్రహాలయ్ మరియు ఇతర ప్రదేశాలను చూపించడం జరిగింది.