Tuesday, 3 November 2026

నలమాస తేజం మరణం సిపిఐ పార్టీకి కి తీరని లోటు

నలమాస తేజం మరణం సిపిఐ పార్టీకి కి తీరని లోటు
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

టేకులపల్లి, డిసెంబర్ 29( జనం సాక్షి ): మాజీ సిపిఐ మండల కార్యదర్శి నలమాస తేజం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బొమ్మనపల్లి గ్రామంలో తేజ దశదిన కర్మకు హాజరై ఏర్పాటుచేసిన సంతాప సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాష లు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం టేకులపల్లి మండలంలో సిపిఐ పార్టీని ఈ ప్రాంతంలో బలమైన పార్టీగా బలమైన నాయకునిగా ఉండి పార్టీని బలోపేతం చేయడంలో తేజం కృషి ఎంతో చేశారని, బొమ్మనపల్లి, శంభునిగూడెం గ్రామపంచాయతీ లు సుజాతనగర్ నియోజకవర్గంలో ఈ రెండు గ్రామపంచాయతీలుఉండేవని, రజబలి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీకి ఎంతో అభివృద్ధి చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు కోసం ఎంతో కృషి చేసాడన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వారు ఈ సమయంలో లేనందున పార్టీకి తీరని లోటని వారన్నారు. వారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుప్తల సత్యనారాయణ,నారాటి ప్రసాద్, కే సారయ్య, ఏపూరి బ్రహ్మం, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాస్, రేస్ ఎల్లయ్య, గుగులోతు రామచందర్, ఐతా శ్రీరాములుతదితరులు పాల్గొన్నారు.