Sunday, 8 November 2026

మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల గోడ ప్రతుల విడుదల

మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల గోడ ప్రతుల విడుదల

ఫోటో :- పోస్టర్లు అంటిస్తున్న పోలీసులు

వేమనపల్లి,డిసెంబర్ 22,(జనంసాక్షి):

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్,నీల్వాయి ఎస్సై గోపతి నరేష్ ఆధ్వర్యంలో పది మంది సభ్యులు గల మావోయిస్ట్ యాక్షన్ టీం సభ్యుల వివరాలతో ఉన్న వాల్ పోస్టర్లను వేమనపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో గురువారం అంటించారు.ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ..యువతీ,యువకులు మావోయిస్టు తీవ్రవాద కార్యకలాపాలకు సహకరించి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని,మావోయిస్టుల వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆకస్మిక వాహన తనిఖీలు,ఏరియా డామినేషన్స్,ఫెర్రీ పాయింట్స్ చెకింగ్స్,కల్వర్ట్ చెకింగ్ లు నిర్వహిస్తున్నామని అన్నారు.మావోల అలజడిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మావోయిస్టు యాక్షన్ టీం ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తామని,ఆచూకీ తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.మావోయిస్టులు హింసాత్మక పద్ధతులతో సాధించేదేంలేదని,ఆయుధాలను వీడీ జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.ప్రజల అభివృద్ధికి నిరోధకులుగా మావోలు మారారని అన్నారు. మావోయాక్షన్ టీం సభ్యులు గాని అనుమానాస్పద వ్యక్తులుగాని కనిపిస్తే ప్రజలు స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.