Tuesday, 3 November 2026

నల్లజెండాల ప్రదర్శన

కరీంనగర్‌, నవంబర్‌ 1 : జిల్లాలో గురువారం నవంబర్‌ ఒకటిని విద్రోహదినంగా పాటించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల తహశీల్దార్‌, ఎండిఓ కార్యాలయాలపై తెలంగాణవాదులు గురువారంనాడు నల్లజెండాలు ఎగురవేశారు. పట్టణంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఆధ్వర్యంలో తెలంగాణ స్థూపం వద్ద నల్లజెండా ఎగురవేశారు. అనంతరం పోలీస్‌ హెడ్‌క్వాటర్‌లో నల్లజెండాలు ఎగురవేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులువారిని అడ్డుకొని లక్ష్మణరావుతో పాటు రవీందర్‌సింగ్‌, పలువురు టిఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నారదాసు మాట్లాడుతూ తెలంగాణను ఏర్పాటు చేస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలను మోసగిస్తోందని, ఆ దిశగా ఎలాంటి ప్రక్రియ ప్రభుత్వం చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటుకూడా దక్కదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని లక్ష్మణరావు అన్నారు. జిల్లాలోని హుస్నాబాద్‌, హుజురాబాద్‌, గోదావరి ఖని, ధర్మపురి, వెల్గటూరు మండలాల్లో తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా భారీఎత్తున ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *