Tuesday, 3 November 2026

బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి

కరీంనగర్‌, నవంబర్‌ 1 : బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు మోహన్‌బాబు ఆయన కుమారుడు విష్ణు క్షమాపణలు చెప్పాలని జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా చిత్రం నిర్మించిన విషయమై ఆయనను విచారించేందుకు వెళ్లిన వారిపై కిరాయి గుండాలతో దాడి చేయించారని బ్రాహ్మణ సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు చర్యను నిరసిస్తూ బ్రాహ్మణులు గురువారంనాడు పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా వారిని చిన్నచూపు చూస్తూ అవహేలన చేస్తూ   సినిమాలు తీస్తున్నారని అలాంటివారిని సహించేది లేదని వారన్నారు. సినీ రచయితలు ఎవరైనా బ్రాహ్మణ వృత్తిని దెబ్బతిసే విధంగా సినిమాలలో మాటలు రాసిన వారిపై, నిర్మాతలపై, దర్శకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా బ్రాహ్మణులపై చేసిన అనుచితవ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. లేనిచో వారు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని బ్రాహ్మణ సంఘం సభ్యులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *