జిన్నారం జులై 13(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండము నల్లవల్లి గ్రామంలో రైతు బీమా దరఖాస్తులను గురువారం సర్పంచ్ శంకర్ తో కలిసి స్వీకరిస్తున్న గుమ్మడిదల మండల వ్యవసాయ శాఖ అధికారులు!! ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి డి. శ్రీనివాసరావు మాట్లాడుతూ గత నెల18 తారీఖు వరకూ డిజిటల్ సైన్ అయినా రైతులు మరియు ఇదివరకు దరఖాస్తు చేసుకోలేని రైతులు 2023
సంవత్సరం రైతు బీమా పథకం కోసం మీ గ్రామ వ్యవసాయ విస్తరనధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు!!! ఇందుకోసం పట్టాదార్ పాస్ పుస్తకం, జిరాక్స్ ఆధార్ జిరాక్స్, నామిని జిరాక్స్, రైతు బీమా దరఖాస్తు ఫారం జతపరచాలని ఆయన వెల్లడించారు. ఏవో. డి. శ్రీనివాస్ రావు, ఏఈఓ అస్మిత, గౌరవ ప్రజా ప్రతినిధులు,రైతుబంధు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
నల్లవల్లి గ్రామంలో రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ




