Tuesday, 3 November 2026

ప్రకృతి రెడ్డి పాటలతో పరవశించిన ఆహుతులు 

 

 

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 29 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని కాజీపేట తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు చిత్ర సీమ గాయని, ఆస్కార్ అవార్డున సొంతం చేసుకున్న త్రిబుల్ ఆర్ లోని కొమ్మ ఉయ్యాల పాడిన ప్రకృతి రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తన యొక్క పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది ఈ సందర్భంగా ప్రకృతి రెడ్డిని తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం త పాటు పలువురు అభినందించారు. ప్రకృతి రెడ్డి తన పాటలను పాడుతున్నంత సేపు ఆహుతులు మైమరిచిపోయారు. చప్పట్లతో ప్రకృతికి రెడ్డికి అభినందనలు తెలిపారు అదేవిధంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు కూడా తమ డాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు