Thursday, 5 November 2026

నల్ల బెల్లం , పట్టిక సప్లయ్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి – సారా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి – డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 18 (జనంసాక్షి):నల్ల బెల్లం , పట్టిక సప్లయ్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, సారా తయారీదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిఎస్పి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని
పోలీస్ స్టేషన్ నందు కోదాడ డిఎస్పి వెంకటేశ్వరరెడ్డి అధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని మండలాల ఎస్ఐలు, ఎక్సైజ్ సిఐ, ఎక్సైజ్ ఎస్ ఐ లతో ఎక్సైజ్ క్రైమ్ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ వారీగా సారా తయారీ దారులను, రవాణాదార్లు, ముఖ్యంగా బెల్లం, పట్టిక సప్లయ్ దారులను గుర్తించి వారిని తక్షణమే బైన్దోవర్ చేయించాలని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచి ఎక్సైజ్ శాఖతో కలిసి జాయింట్ గా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో సారా తయారీకి బెల్లం , పట్టిక సరఫరా చేసే వ్యక్తులకు, కిరాణా దుకాణం యజమానులు ఎవ్వరికి అమ్మకూడదని హెచ్చరించారు. సారా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సారా తయారీ వలన ప్రజల ఆరోగ్యానికి హానికరంతో పాటు, ప్రభుత్వ ఆదాయం కోల్పోవడం జరుగుతుందని, అందువల్ల సారా ను సమర్ధవంతంగా అరికట్టాలని సూచించారు. ఎక్సైజ్ శాఖకు సారా నిర్మూలన లో పోలీస్ శాఖ నుండి పూర్తి సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ సీఐ నాగార్జున రెడ్డి, మండలాల ఎస్ఐలు, ఎక్సైజ్ శాఖ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.