నల్ల బ్యాడ్జీలతో పెన్షన్ విద్రోహ దినం నిరసన
టేకులపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి ): పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా శుక్రవారం టేకులపల్లి మండలంలో జరుగుతున్న ఉన్నతి శిక్షణ కార్యక్రమానికి భద్రాద్రి జిల్లా పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు హాజరై, శిక్షణ కార్యక్రమంను ఉద్దేశించి, ఉపాధ్యాయుల సమస్యలను, వాటి పరిష్కారమార్గాలను, త్వరలో జరగబోయే బదిలీలు, ప్రమోషన్ల వ్యవహారం ఇతర అనేక విషయాల గురించి వివరించారు. అలాగే ఉపాధ్యాయులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి, సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలుపడంతో పాటు సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల అధ్యక్షులు జి.మోతిలాల్,జిల్లా ఉపాధ్యక్షులు టి. రవీందర్, కోర్స్ డైరెక్టర్ జగన్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.