Tuesday, 3 November 2026

నవంబర్‌1వ తేదీకి ఏర్పాట్లు

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి నవంబర్‌ 1వ తేదీన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, నగర పాలకసంస్థ ఇతర అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. నగరపాలక సంస్థ పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో తాగునీరు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆర్‌.డి.ఓ. ఆహ్వానితులకు సీటింగ్‌ ఏర్పాట్లు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ను పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ఏర్పాటు, విద్యాశాఖ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, అదనపు జేసీ. సుందర్‌ అబ్నార్‌ డి.ఆర్‌.ఓ. జె.సుధాకర్‌ రావు, జడ్‌.పి. సి.ఈ.ఓ. చక్రధర్‌ రావు ముఖ్య ప్రణాలిక అధికారి సుబ్బారావు, డి.ఆర్‌.డి.ఏ., డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌లు శంకరయ్య, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *