డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్.కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 18.,(జనంసాక్షి). సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు చిటికెన నవీన్ ది ముమ్మాటికి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్యేనని డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని భర్తీ చేయకుండా యువకుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే పరిస్థితి మంత్రికి అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలయాపర చేస్తున్న ప్రభుత్వ వైఖరి వల్లే నవీన్ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు నవీన్ మరణం తనను ఎంతో కలచి వేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవీన్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు,నాగుల సత్యనారాయణ గౌడ్, మైనారిటీ సెల్ నాయకులు రియాజ్, చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
నవీన్ ది ప్రభుత్వం చేసిన హత్యే.




