Thursday, 5 November 2026

హత్ సే హత్ జూడో యాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి.

ఏఐయుడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడాలి సురేష్.కోటగిరి మార్చి 18 జనం సాక్షి:-టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఈ నెల 20 వ తేదీన బాన్సువాడ నియోజకవర్గంలోనీ నసుర్లాబాద్ మండల కేంద్రంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో నియోజక వర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏఐయుడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడాలి సురేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపు గా టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణలో చేపట్టిన హాత్ సే హాత్ జోడోకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.కావున ఈ నెల 20 తేదీన బాన్సువాడ నియోజక వర్గంలో కొనసాగే ఈ పాద యాత్రను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలనీ ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని,కావున ప్రతి ఒక్క కార్యకర్తలు అయోమయాన్ని వీడి ఎన్నికల వరకు కదం తొక్కలని ఆయన కార్యకర్తలకు పిలునిచ్చారు.