Wednesday, 4 November 2026

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి, సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. మరోవైపు ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై పడే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించవచ్చన్న ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగా  స్టాక్‌ మార్కెట్లు స్పందిస్తున్నాయి.  ఢిల్లీ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం వున్నందున…  స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని అంటున్నారు. ఈ వారం వెలువడే జీడీపీ, పారిశ్రామికోత్పత్రి గణాంకాలు, కొన్ని బ్లూచిప్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *