Tuesday, 3 November 2026

నాకు వస్తున్నా ప్రజాదరణ చూసి గిట్టని వారు చేస్తున్న పని …. కొడవటూరు సర్పంచి గంగం సతీష్ రెడ్డి

బచ్చన్నపేట(జనం సాక్షి) బచ్చన్నపేట మండలంలో నాకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి అదేవిధంగా మా గ్రామం కొడవ టూరు గ్రామపంచాయతీకి వస్తున్న అవార్డులను చూసి ఓర్చుకోలేని కొంతమంది నాపై హత్య నేరం మోపుతున్నారని బచ్చన్నపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ .కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు దివి 15 -6 -2023 రోజున రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య గారి కిడ్నాప్ మరియు హత్యకు సంబంధించిన విషయంలో వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రాగాడ సానుభూతి తెలియజేస్తున్నాను ఒక కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉంటుందో ఈ ఘటనకు సంబంధం లేకుండా నన్ను ఇరికిచ్చే ప్రయత్నంలో నాకు నా కుటుంబ సభ్యులకు కూడా అంతే బాధ కలుగుతుంది ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీడియా ద్వారా మండల ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను
*రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య గారికి నాకు ఎలాంటి పరిచయం లేదు ఇది కేవలము అత్యా నేరం అంగీకరించిన వ్యక్తి యొక్క సొంత భూమి వివాదాల కారణమని అర్థమవుతుంది… *నాకు వారికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి విభేదాలు కానీ సంబంధాలు కానీ లేవు…
*ఈ యొక్క హత్యని నేనే చేయించానని అనడం విడ్డూరంగా అనిపిస్తుంది అవసరమైతే కొడవటూరు స్వయంభు:సిద్దేశ్వర స్వామి మొదటి మెట్టు వద్ద అడుక్కొని తింటాను తప్ప ఇలాంటి వ్యక్తిత్వం గానీ ఆలోచన సరళి గానీ నాది కాదు…..
*ఇది కేవలం నాపైన ఉన్న అక్కసుతో మండల పరిధిలో నాకు వస్తున్న ప్రజాదరణ చూసి జిల్లాలో నాకు నా గ్రామ పంచాయతీకి వస్తున్న అవార్డులను చూసి ఓర్వలేక కొందరు గిట్టని అసూయపరులు దివంగత రామకృష్ణయ్య కుటుంబ సభ్యులను తప్పుదారి పట్టించి నాపై తప్పుడు మరియు సంబంధంలేని ఆరోపణ చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు నాపై వచ్చిన ఆరోపణలకు పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాను…….
*ముఖ్యంగా దివి 21- 5- 2023 రోజున నారాయణపురం సర్పంచ్ రవీందర్ రెడ్డి గారి ఇంటి వద్ద జరిగిన విందు కార్యక్రమంలో రామకృష్ణయ్యను చంపితే నేను డబ్బులు ఇస్తానని అన్నానని తప్పుడు ఆరోపణ చేస్తున్నారు అసలు ఆ చోట అలాంటి ప్రస్తావన ఏది రాలేదని మీ ద్వారా మండల ప్రజలకు తెలియజేస్తున్నాను.
*రామకృష్ణయ్య గారి ప్రస్తావన అసలే రాలేదు ఆయనను చంపించవలసిన అవసరం నాకు అంతకంటే లేదు……..
*ఇది కేవలం కొంతమంది పని కట్టుకొని ప్రజలని అయోమయానికి గురిచేయాలనే ఉద్దేశంతో చట్టం లోని లోసుగులను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ రామకృష్ణయ్య గారి కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్న వారందరిపై నేను కూడా న్యాయపోరాటం చేస్తానని వీరందరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో మరియు CP గారికి , DGP గారికి , హోం శాఖ మంత్రి గారికి ఫిర్యాదు చేస్తూ మీరు గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాల ఆధారాలతో సమర్పిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను………
*ఇందులో నాతో పాటుగా సంబంధం లేని ప్రజాప్రతినిధులను రోజుకు కొందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు…….
*వారికి గిట్టని వారిని ఒక్కొక్కరుగా రామకృష్ణయ్య కుటుంబ సభ్యుల పక్కన చేరి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ సుమారు 45 మంది మీద ఫిర్యాదు చేసినట్లు మా దృష్టికి వచ్చింది……
*ఇకనైనా ఈ తప్పుడు ఆరోపణలు మానుకొని నిజంగా రామకృష్ణయ్య గారి హత్యకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉన్న మరియు సహకరించిన ప్రతి ఒక్కరిని విచారణ చేసి చట్టరీత్య శిక్షించాలని మీ ద్వారా సంబంధిత అధికారులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి. పిఎసిఎస్ పులిగిల్ల పూర్ణచందర్. సర్పంచులు మాసాపేట రవీందర్ రెడ్డి. వడ్డేపల్లి మల్లారెడ్డి. గిద్దెల రమేష్. ముసిని రాజు. బంధారపు వినయ్. ఎండి అజాం. పర్వతం మధు. కోనేటి స్వామి. మండల కోఆప్షన్ సభ్యులు షబ్బీర్ అహ్మద్. పట్టణ అధ్యక్షులు గంధ మల్ల నరేందర్. గుర్రపు బాలరాజు. మీసా శ్రీనివాస్. పంజాల శ్రీధర్. జంగిడి సిద్ధులు. బొట్టు సుధాకర్. తప్పెట్ల వినోద్ కుమార్ ఉన్నారు