Tuesday, 3 November 2026

పోడు భూములు సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలి * న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్

టేకులపల్లి, జూన్ 28( జనం సాక్షి): జీవనాధారంగా పోడు భూములను సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ పోడు సాగు చేసుకుంటున్నా రైతులందరికీ హక్కు పట్టాలు ఇవ్వాలని ఇచ్చిన పిలుపులో భాగంగా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ టేకులపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల ముందు కుర్చీ వేసుకొని పోడు భూములకు పట్టాలు ఇచ్చేవరకు ఇక నుండి కదలని ప్రగల్బాల్ పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల అయిపోగానే ఒక్కరికి కూడా పట్టాలి ఇవ్వలేదని ఆయన అన్నారు. పట్టాలు ఇవ్వకపోగా సాగు చేసుకుంటున్న భూమిని హరితహారం పేరుతో లాక్కోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. పొట్టకూటి కోసం పోడుకోట్టుకున్న రైతులపై పిడి యాక్ట్ కేసులు పెట్టడం దొరల పాలనకు నిదర్శనం అన్నారు.13 లక్షల 50 వేల మంది అప్లై చేసుకుంటే గిరిజనులు,గిరిజనేతరులు,ఉద్యోగస్తులు,వృద్ధులు అని సాకులు చెబుతూ దరఖాస్తుల మొత్తం తిరస్కరించి ఏడు లక్షల మందికి అసెంబ్లీలో పట్టాలిస్తామని చెప్పి నేడు 70 వేల మందికి ఇస్తానని చెప్పడంలో పేద గిరిజనుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి కనపడుతుందని విమర్శించారు. నాటి ఎన్నికల నుండి ఈరోజు వరకి ఒక్కరికి కూడా పట్టాలు అని కేసిఆర్ ఈనెల 30 నుంచి పట్టాలు ఇస్తానని చెప్పడం ఎన్నికల్ల ఎత్తుగడలో భాగమేనని ఆయన అన్నారు.ఇప్పటికైనా పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్న గిరిజనులకు గిరిజనేతరులకు ప్రతి ఒక్కరికి పోడు భూములకు పట్టాలి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రస�